in

keerthy suresh finally doing a movie under her dad’s production!

తాజాగా మలయాళంలో ఓ సినిమాను మొదలుపెట్టింది. దీనికి ‘వాషి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే..కీర్తి సొంత నిర్మాణ సంస్థలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిజానికి ఇది కొత్త నిర్మాణ సంస్థ కాదు. కీర్తి సురేష్ తండ్రి సురేష్ కి సంబంధించిన బ్యానర్ ఇది. ఆయన మలయాళంలో పేరున్న నిర్మాత. ఎనభై, తొంబై దశకాల్లో భారీ ఎత్తున సినిమాలను నిర్మించారు. మొదట వేరే నిర్మాతలతో కలిసి సినిమాలు తీసేవారు సురేష్.

ఆ తరువాత నటి మేనకను పెళ్లాడిన తరువాత ‘రేవతి కళామందిర్’ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను పెట్టి సినిమాలను నిర్మిస్తున్నారు. కెరీర్ ఆరంభించిన కొత్తల్లో కీర్తి సురేష్ ఇదే బ్యానర్ ‘పైలట్స్’ అనే సినిమాలో నటించింది. కానీ తను స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న తరువాత సొంత నిర్మాణ సంస్థలో సినిమా చేయలేదు. ఫైనల్ గా తన తండ్రి బ్యానర్ లో ‘వాషి’ అనే సినిమా చేస్తుంది. ఇందులో మలయాళ టాలెంటెడ్ హీరో టోవినో థామస్ హీరోగా నటిస్తున్నాడు. ఈ హీరో నటించిన చాలా మలయాళ సినిమాలు తెలుగులో డబ్ అయి ఓటీటీలో విడుదలయ్యాయి. ఆ విధంగా తెలుగులో కూడా ఫేమస్ అయ్యాడు ఈ హీరో.

madhurima at best actors movie press meet!

Adbhutham!