in

‘Jathi Ratnalu’ Faria to shake a leg with king nagarjuna!

జాతిరత్నాలు’ సినిమాలో చిట్టిగా నటించి యూత్ లో బాగా క్రేజ్ సంపాదించుకుంది ‘ఫరియా అబ్దుల్లా’. ‘జాతిరత్నాలు’ ఫేమ్ తో వరుస అవకాశాలు పట్టేస్తున్న ఈ అమ్మడు.. ఐటమ్ సాంగ్ చేసేందుకు కూడా రెడీ అయ్యిందని తెలుస్తోంది. ‘బంగార్రాజు’ సినిమాలో నాగార్జునతో కలిసి స్పెషల్ సాంగ్ లో చిందేయడానికి ఓకే చెప్పిందని సమాచారం. స్టార్ హీరోయిన్స్ సైతం స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే తమన్నా, కాజల్, పూజ హెగ్డే స్పెషల్ సాంగ్స్ లో సందడి చేయగా..

ఇటీవల సమంత సైతం ‘పుష్ప’ మూవీలో స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడదే బాటలో ఫరియా కూడా పయనించనుందని తెలుస్తోంది. ‘బంగార్రాజు’ మూవీలో స్పెషల్ సాంగ్ చేయనుందని సమాచారం. చిట్టి తన స్టెప్స్ తో ఎలా అలరిస్తుందో చూడాలి. చిట్టి అక్కినేని ఫ్యామిలీకి లక్కీ లేడీ అని కూడా చెప్పొచ్చు. అక్కినేని హీరో అఖిల్ కి ఫస్ట్ హిట్ ఇచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’లో చిట్టి మెరిసింది. ఫరియా ప్రస్తుతం మంచు విష్ణు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న ‘డి అండ్ డి’ సినిమాలో నటిస్తోంది.

Goa beauty ileana cried for the words said by the trainer!

madhurima at best actors movie press meet!