అలనాటి మహానటి సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన అందాల నటి కీర్తి సురేశ్. ‘మహానటి’ ఫిల్మ్ తో నేషనల్ అవార్డు పొందిన ఈ సుందరి..తన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది. ప్రజెంట్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ప్రతీ విషయాన్ని ఎప్పడికప్పుడు షేర్ చేస్తుంటుంది ఈ ముద్దు గుమ్మ.
అయితే..కీర్తి సురేష్ పెళ్లిపై పుకార్లు ఆగడం లేదు. తాజాగా కీర్తి, మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం మొదలైంది. దీనిపై ఆమె తండ్రి సురేష్ స్పందించారు. ‘కీర్తి – అనిరూద్ పై వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇలాంటి వార్తలు రావడం ఇదేమి తొలిసారి కాదు. ఎవరో కావాలని ఇలా చేస్తున్నారు’ అని అన్నారు. అనిరుద్ తో పెళ్లిని ఖండించిన కీర్తి… అది తప్పుడు వార్త అని, అనిరుద్ మంచి స్నేహితుడని తెలిపారు..!!