కీర్తి సురేష్ మహానటి చిత్రంతో జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. అంతే కాకుండా ఈ చిత్రంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మహానటి హీరోయిన్ కీర్తి లవ్ ప్రపోజల్స్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాలేజీ రోజుల్లో తనకు ఎవరూ ప్రేమ లేఖలు రాయలేదని అలాగే ఎవరూ ప్రపోజ్ కూడా చేయలేదని చెప్పారు. అయితే ఒకసారి జ్యూవెలరీ షాపు ఓపెనింగ్ కు వెళ్లినప్పుడు అక్కడకు వచ్చిన ఒక అభిమాని లవ్ లెటర్ తో పాటు బహుమతి ని కూడా ఇచ్చినట్లు కీర్తి వెల్లడించింది.
ఆ బహుమతి లో తన ఫోటోలను అల్బమ్ గా ఎంతో చక్కగా అమర్చాడని చెప్పారు. అయితే తనకు ఇచ్చిన లవ్ లెటర్ ని మాత్రం చాలా భద్రంగా దాచుకున్నాను అని కీర్తి తన లవ్ లెటర్ సీక్రెట్‌ను బయట పెట్టింది. దాన్లో తనకు ప్రపోజ్ చేస్తూ చాలా చక్కగా వ్రాసాడని ఆమె చెప్పింది. ఇక కీర్తి చిత్రాల పరంగా వస్తే ‘గుడ్ లక్ సఖి’, ‘రంగ్ దే’ చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి.