in

Karan Johar wants to get samantha for Salman’s next?

ల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశం తలుపు తట్టినట్టు ముంబై టాక్. పవన్ కళ్యాణ్ పంజా తీసిన దర్శకుడు విష్ణువర్ధన్ తో నిర్మాత కరణ్ జోహార్ ఓ భారీ ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనికోసమే కండల వీరుడు గుండు కొట్టించుకున్నాడు. మిలిటరీ ఆఫీసర్ గా చాలా పవర్ ఫుల్ రోల్ డిజైన్ చేశారట. టైగర్ 3 బ్యాలన్స్ వర్క్, ప్రమోషన్లు పూర్తి కాగానే దీని రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు..

అయితే సమంతాను ఖచ్చితంగా ఓకే చేశారా లేదానేది అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చాకే తెలుస్తుంది. వరస ఫ్లాపుల దెబ్బకు సామ్ మార్కెట్ మీద కొంత ప్రభావం పడిన మాట వాస్తవమే. పైగా ఖుషిలో లుక్స్ పట్ల మిశ్రమ స్పందన వచ్చింది. అందుకే మళ్ళీ తనను తాను కొత్తగా మేకోవర్ చేసుకున్న సమంతాకు సల్మాన్ సరసన ప్రాజెక్టు ఓకే అయితే మరిన్ని ఆఫర్లు పట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఇలియానా తరహాలో అక్కడి స్టార్ హీరోలతో జోడి కట్టొచ్చు..!!

‘devara’ to have one of the biggest underwater sequences!

happy birthday ramya krishna!