ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం దేవర. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ పోస్టర్ భారీ అంచనాలను పెంచేసింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన బాడీ లాంగ్వేజ్‌తో పాటు లుక్‌ని కూడా మార్చాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.
ఓ క్రేజీ సీక్వెన్స్ ని అండర్ వాటర్ లో ప్లాన్ చేయగా దీనికోసం స్పెసల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు జూనియర్. బ్లూ మ్యాట్స్ నడుమ వేసిన వాటర్ పూల్ లో క్రేజీ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తుండగా ఇందుకు సంబంధించిన పిక్ వైరల్‌గా మారింది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఇది 30వ సినిమా. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది..!!