ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కామ్నా మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితంతోపాటు.. సినిమాల్లోనూ నటించాలనుందంటూ ఆసక్తికర విషయాలను చెప్పుకోచ్చింది. తనది సింధీ ఫ్యామిలీ అని.. మా కుటుంబంలో 21 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేస్తారని.. కానీ మా అమ్మ నాకు సపోర్ట్ చేసిందని కామ్నా జెఠ్మలానీ చెప్పారు. ఆ తర్వాత మోడలింగ్, డ్యాన్సర్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసానని.. మొదటి జీతం రూ. 300 అని తెలిపింది. అలాగే తాను పడిన కష్టం గురించి ముందే తన భర్తకు చెప్పానని కామ్నా అన్నారు.
నిశ్చితార్థం సమయంలో చేతిలో మూడు సినిమాలు ఉన్నాయని.. ఫుల్ బిజీగా ఉన్న టైంలోనే పెళ్లి చేసుకున్నానని… కానీ ఇప్పటికీ నటన అంటే పిచ్చి అని చెప్పుకొచ్చింది. తనకు సినిమాలు చేయమంటే ఇష్టమని.. అందుకు తన భర్త కూడా సపోర్ట్ ఇస్తారని చెప్పారు. ప్రస్తుతం తనకు పూరీ జగన్నాథ్ సినిమాలో నటించాలనుందని.. అలాగే రాజమౌళి సినిమాలో ఒక చిన్న పాత్ర అయిన చేయాలనుందని తెలిపింది. ఇవే కాకుండా.. ఓ స్పెషల్ సాంగ్ చేయాలనుందని చెప్పుకొచ్చింది కామ్నా.