ఎప్పుడు పెద్దగా వార్తల్లో ఉండని మంచు విష్ణు..గత మూడు రోజులుగా మీడియా లో హైలైట్ అవుతున్నాడు. ఎందుకంటే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన విష్ణు..అందులో చాల విషయాలు చెప్పడమే ఆయన్ను వైరల్ గా మార్చాయి. ఇప్పటికే పలు విషయాలు బయటకు రాగా..తాజాగా కళ్యాణ్ రామ్ , నితిన్ లను ఈ ఇంటర్వ్యూ లో రాస్కెల్ అనడం బయటకు వచ్చింది. ఇదేదో కోపం తో అన్నది కాదు వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం తో అన్నమాట. నితిన్ కళ్యాణ్ రామ్ ఇద్దరూ రాస్కెల్స్.. వాళ్లకి ఇప్పటివరకూ నేను నాలుగు సినిమాలు ఆఫర్ చేశా కలిసి చేద్దాం అని. వాళ్లిద్దరూ రిజెక్ట్ చేశారు. ఇక సుమంత్.. నాకంటే పెద్దోడు.. ఎప్పుడైనా కనిపిస్తే గొంతు పిసికేయాలి అనుకుంటా.
ఎందుకంటే.. నా అప్ కమింగ్ మూవీ ‘మోసగాళ్లు’లో కూడా చేయమని చెప్పా. నేను చేయను అని చెప్పేశాడు. ఈ క్యారెక్టర్ నాకు నచ్చలేదు అన్నాడు. నాకు మల్టీస్టారర్ చేయడం బాగా ఇష్టం.. కళ్యాణ్ రామ్‌ని, నితిన్‌ని ఎన్నోసార్లు అడిగాను. ఈడోరకం-ఆడోరకం సినిమా ఫస్ట్ కళ్యాణ్ రామ్‌ని అడిగా కానీ చేయలేదు. నితిన్‌తో అయితే ఇప్పుడు కాదు.. 10-12 ఏళ్లుగా చేయాలని ఉంది. మా ఇద్దరి మధ్య టైమింగ్ బాగుంటుంది. దోస్తానం సినిమా చేయాలని నితిన్‌ని అడిగాను. ఇప్పటికీ పెండింగ్‌లో ఉంచాడు. బట్ నితిన్‌కి హిట్ వస్తే.. నాకు వచ్చినట్టే. ఎందుకంటే స్ట్రగుల్ అంటే ఏంటో బాగా తెలిసినవాడు. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. భీష్మ సినిమా విడుదల కాగానే కంగ్రాట్స్ బ్రదర్ అనగానే.. నువ్ సినిమా చూసి ఫోన్ చేయి అన్నాడు. కాని నాకు సినిమా చూడటం వీలు కాలేదు. వరుసగా షూటింగ్‌లతో పాటు అమెరికా వెళ్లిరావడం.. ఈలోపు కరోనా హడావిడితో సినిమా చూడటం వీలు కాలేదు అని చెప్పుకొచ్చాడు.