
ఫ్యామిలీ స్టార్’ డిజాస్టర్ తర్వాత, దర్శకుడు పరుశురామ్ తన నెక్స్ట్ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్‌తో పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడట. ఇటీవల ఆయన కళ్యాణ్ రామ్‌కు ఒక కథను వినిపించి మెప్పించాడట. త్వరలోనే పూర్తి స్థాయి స్క్రిప్ట్ వినిపించి ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నాడట. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్, వెంకటేష్‌తో కలిసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న మల్టీస్టారర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా 2027 సంక్రాంతికి విడుదల కానుండగా, పరుశురామ్-కళ్యాణ్ రామ్ కాంబినేషన్ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి..!!

