in

kalki director Nag Ashwin took a dig at Animal director sandeep reddy?

ల్కి 2898 AD  బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ  సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది.  విడుదలైన నాటి నుంచి.. కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. భారీ వసూళ్లను సాధించినందుకు ఈ మూవీ టీమ్ మొత్తం ఫుల్ హ్యాపీగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన ఈ చిత్రం కల్కి సీక్వెల్ పై అంచనాలను పెంచింది. ఈ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ 1000 కోట్ల మైలురాయిని చేరుకుందని కల్కి టీమ్ అధికారికంగా ప్రకటించింది..

తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో, చిత్ర విజయాన్ని జరుపుకుంటున్న కల్కి దర్శకుడు “రక్తం, గోరు, అశ్లీలత , రెచ్చగొట్టే కంటెంట్ లేకుండా” చిత్రం ప్రదర్శించిన తీరుకు గర్వపడుతున్నాను. అంటూ పేర్కొనడం తీవ్ర దుమారం రేపుతోంది. యానిమల్ మూవీలో రక్తపాతం, అధిక హింస వంటివి ఎక్కువగా ఉండటం..ఎక్కువ విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇప్పుడు నాగ్ అశ్విన్  చేసిన కామెంట్స్..దర్శకుడు సందీప్ వంగాను ఉద్దేశించే చేశాడు అనే కామెంట్స్ వినపడుతున్నాయి..!!

actress Poonam Kaur sensational comments on trivikram’s character!

KGF beauty signs one more Telugu Film!