in

Kalki 2898 AD creates history on Book My Show!

ల్కి రికార్డుల పరంపరలో మరో రికార్డు బద్దలైంది. బుక్ మై షోలో అత్యధిక టికెట్లు విక్రయమైన సినిమాగా ఇంతకుముందు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ చిత్రం జవాన్ పేరుమీద రికార్డు ఉండేది. ఆ సినిమాకు సంబంధించి 12.01 మిలియన్ టికెట్లు అమ్ముడుపోయాయి. తాజాగా ప్రభాస్ కల్కి చిత్రం టికెట్లు 12.15 మిలియన్లకు పైగా విక్రయమయ్యాయి. దీంతో షారుక్ రికార్డును ప్రభాస్ బద్దలుకొట్టినట్లైంది.

వసూళ్ల వర్షం కురిపిస్తున్న కల్కి చిత్రం విజయంతోపాటు ఈ రికార్డు కూడా రావడంతో డార్లింగ్ అభిమానులు సోషల్ మీడియాలో ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు..ఇప్పటికే రూ.వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా రూ.1200 కోట్లు రాబట్టే దిశగా పయనిస్తోంది. ఈ సినిమా విజయం సాధించడంద్వారా వచ్చిన ఉత్సాహంతో ఉన్న ప్రభాస్ తన తర్వాత చిత్రాలను కూడా శరవేగంగా పూర్తిచేయాలనే ఆలోచనతో ఉన్నారు..!!

Janhvi Kapoor hospitalised due to food poisoning!

Darling!