in

kajal’s web series debut with a remake!

టీవల కాలంలో సినిమాలకు అతీతంగా వెబ్‌ సిరీస్‌లకు క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అందులో నటించేందుకు టాప్ హీరో హీరోయిన్లు ఆసక్తిని చూపుతున్నారు. ఇక స్టార్‌ దర్శకులు సైతం వెబ్‌ సిరీస్‌లను నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ చందమామ కాజల్‌ వెబ్‌ సిరీస్‌లో అడుగుపెట్టబోతున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం కాజల్‌.. ఓ హాలీవుడ్‌ పాపులర్ సిరీస్‌లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

హాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన క్వాంటికో సిరీస్‌ ప్రస్తుతం నాలుగో సీజన్‌కి సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే భారతీయ ప్రేక్షకుల కోసం ఈ సిరీస్‌ని రీమేక్‌ చేయబోతున్నారట. ఇక ఇందులో ప్రియాంక చోప్రా పాత్రలో చందమామ మెరవనుందట. మొదటి నుంచి ఈ సిరీస్‌ను ఫాలో అవుతున్న కాజల్‌.. ఇప్పుడు రీమేక్‌లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లో ఆరుకు పైగా చిత్రాల్లో కాజల్ నటిస్తోన్న విషయం తెలిసిందే.

Keerthy in ‘Erra Gulabilu’ sequel?

prabhas becomes the highest paid Indian actor!