మాల్దీవ్స్‌లోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌ను వారం రోజులకు అద్దెకు తీసుకున్నారు కాజల్ జంట. అక్కడే ఉండి తమ తీపిప్రయాణాన్ని మొదలు పెట్టారు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత ఖర్చు కూడా భారీగానే ఉంటుందని అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ లెక్కలు కూడా బయటికి వచ్చాయి. హనీమూన్ కోసం కాజల్ ఖర్చు చేసిన మొత్తం ఎంతో తెలుసా.. అక్షరాలా 40 లక్షలు. అవును.. వారం రోజుల కోసం అంత ఖర్చు చేసారు ఈ జంట. ఉంటుంది మరి.. ఎందుకంటే మాల్దీవ్స్ అంటే భూతల స్వర్గం మరి. అక్కడ నీలిరంగులో మెరిసిపోయే సముద్రపు అలలు.. వాటితో పోటీపడే అందాల భామల సోయగాలు.. ఇసుక తిన్నెలు.. వెన్నెల రాత్రులు.. ఇవన్నీ ఉంటాయి. వాటి మధ్యలో తమ హనీమూన్ గడపాలంటే లక్షలు పోయాల్సిందే. ఇప్పుడు కాజల్ కూడా ఇదే చేసింది.