in

kajal to play prostitute and a raw agent in nag’s next?

నాగార్జునకు పూర్తిస్థాయిలో సహకారం అందించే పాత్రలో కాజల్ అగర్వాల్ హడావుడి చేయనుంది. కాకపోతే కాజల్ ఒక స్పై అనే విషయం క్లైమాక్స్ లో తెలుస్తోంది. ఇక సినిమాలో ఎక్కువ భాగం ఆమె ఒక వేశ్యగా కనిపిస్తోందట. తన అందచందాలతో తీవ్రవాదులను ఆకట్టుకుంటూ వారితో రొమాన్స్ చేస్తూ వారి రహస్యాలను డిపార్ట్మెంట్ కి చేరవేసే పాత్ర అట ఆమెది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్హున హీరోగా రాబోతున్న ఈ సినిమా మొత్తం, ఫుల్ యాక్షన్ తో సాగేలా ఉంది.

అన్నట్టు ఈ సినిమా కోసం కాజల్ యాక్షన్ సీక్వెన్స్ లో కూడా పాల్గొనాల్సి ఉంది. అందుకే కాజల్ ఆ సీన్స్ కోసం కసరత్తులు చేస్తోంది. మరి అందాల చందమామను గూఢచారిగా చూపిస్తే వర్కౌట్ అవుతుందా ? అయినా, కాజల్ కి ఇలాంటి పాత్రలు సెట్ కావు అనేది నెటిజన్లు అభిప్రాయం..పైగా కెరీర్ లో ఇప్పటివరకు ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రను కాజల్ అగర్వాల్ పోషించలేదు. ఒక విధంగా ప్రవీణ్ సత్తారు ఈ పాత్ర కోసం ఏ అనుష్కనో తీసుకుని ఉండి ఉంటే బాగుండేది అని నాగ్ కూడా అన్నాడట..

Rashi Khanna turning psycho killer!

Kajal Agarwal shines in pink on the red carpet!