in

Kajal says ‘Brahmotsavam’ role is her most favorite!

హేష్ బాబు అభిమానులు ఎప్పుడు గుర్తు తెచ్చుకోకూడదనే డిజాస్టర్ బ్రహ్మోత్సవం. అప్పట్లో దీని మీద వచ్చిన హైప్, ప్రమోషన్ అంత సులభంగా మర్చిపోయేది కాదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ద్వారా హోమ్లీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు కావడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కట్ చేస్తే మొదటి ఆటకే దారుణమైన టాక్ తో ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశపరిచింది. ఆ టైంలో టెక్నాలజీ ఈ స్థాయిలో లేదు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ట్రోలింగ్ గురించి ఊహించుకుంటేనే భయం వేస్తుంది.

కానీ కాజల్ అగర్వాల్ షాక్ ఇచ్చింది. తన కెరీర్ లో ఇష్టమైన సినిమాల్లో బ్రహ్మోత్సవంలో చేసిన పాత్ర మొదటిదని ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం చూసి ఫ్యాన్స్ షాక్ తిన్నారు. నిజానికి అందులో సమంతా మెయిన్ హీరోయిన్. కాజల్ ఫస్ట్ హాఫ్ తర్వాత కనిపించదు. అయినా సరే ఇంత ప్రత్యేకంగా కాజల్ దాని గురించి చెప్పడం విచిత్రమే. తను టైటిల్ రోల్ పోషించిన సత్యభామ ఈ నెల 31 విడుదల కానుంది. దాని ప్రమోషన్లో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూలో ఈ సంగతి చెప్పుకొచ్చింది..!!

salaar actor Prithviraj In Rajamouli-Mahesh Babu Film?

TOP 10 MOST FOLLOWED TELUGU ACTORS ON TWITTER!