in

Kajal Aggarwal creates a new record on Instagram!

క్ష్మీ కళ్యాణం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి సూపర్ హిట్ “చందమామ “మూవీ తో గుర్తింపుపొందిన కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు , తమిళ, హిందీ భాషలలో పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి కి జంటగా కాజల్ అగర్వాల్ నటించిన “ఆచార్య “ మూవీ 2022 సంవత్సరం ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కానుంది.

“ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “ , “రౌడీ బేబీ “ (తమిళ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ప్రయోగాత్మక బాలీవుడ్ మూవీ “ఉమ”లో నటిస్తున్న కాజల్ బ్లాక్ బస్టర్ “ఖైదీ “తమిళ మూవీ హిందీ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కాజల్ తన రీల్ లైఫ్ , రియల్ లైఫ్ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సౌత్ స్టార్స్ లో ఒకరుగా నిలిచారు.తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్ ఫాలోవర్స్ మార్క్‌ కు చేరుకొని కాజల్ అగర్వాల్ రికార్డ్ క్రియేట్ చేశారు.

‘Bommarillu’ Bhaskar to do another film for ‘Geetha Arts’?

avika gor latest pics in a garden!