in

kajal agarwal gets a bumper offer!

పూజా హెగ్డే, రష్మిక మందన్న ల జోరు కోనసాగడంతో ఇక కాజల్ పనైపోయిందని అంతా భావించారు. ఇక కాజల్కి ఛాన్స్ లు రావడం తక్కువే అని చెప్పుకున్నారు.కాని అది తప్పు అని ప్రూవ్ చేసింది కాజల్. నా ప్లేస్ నాకే ఉంటుంది. నాకొచ్చే అవకాశాలు వస్తూనే ఉంటాయని ప్రస్తుతం చేస్తున్న క్రేజీ సినిమాలతో నిరూపించింది. ప్రస్తుతం ఈ చందమామ చేతిలో ‘ముంబై సాగా, ఇండియన్ 2’, ‘ఆచార్య’ సినిమాలు ఉన్నాయి. అలాగే ఇలయదళపతి విజయ్ – మురుగదాస్ దర్శకత్వంలో ‘తుపాకి 2’ సినిమాలో కూడా హీరోయిన్ గా కాజల్ అవకాశం దక్కించుకుందని సమాచారం. ఇలా ఇప్పటికే మొత్తం నాలుగు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న కాజల్ కి మరో భారీ ప్రాజెక్ట్ కూడా వచ్చిందని లేటెస్ట్ న్యూస్.

తమిళ్ స్టార్ హీరో సూర్య, మాస్ డైరెక్టర్ హరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే తాజా సినిమాలో కాజల్ నే హీరోయిన్ గా తీసుకోబోతున్నారని కోలీవుడ్ మీడియా సమాచారం. ఇప్పటి వరకు సూర్య – హరి కాంబినేషన్ ‘సింగం సిరీస్, ఆరు, వేల్’ లాంటి సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ కి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. కాబట్టికాజల్ కి మరో బంపర్ ఆఫర్ వచ్చిందని అందరూ అనుకుంటున్నారు..

chiranjeevi about his new look!

rakul’s name is not in the list of drugs case!