తెలుగు ఇండస్ట్రీలో రాఘవేంద్ర రావు చిత్రాలు అంటే ఓ రొమాంటిక్, ఎమోషన్, కామెడీ అన్నీ కలగలిపి ఉంటాయి. అందుకే ఆయన తీసే ప్రతి సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఒకప్పుడు రాఘవేంద్ర రావు చిత్రంలో నటిస్తే చాలు స్టార్ హీరో, హీరోయిన్లు కొవొచ్చు అనే టాక్ ఉండేది. పాతికేళ్ల క్రితం వచ్చిన ‘పెళ్లిసందడి’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఓ సంచలనం సృష్టించింది. ఫ్యామిలీ, లవ్, ఎమెషన్ ఈ మూడింటి సమ్మిళితమే.. పెళ్లి సందండి. అక్కాచెల్లెల్ల త్యాగం.. ప్రేమికుడు అనుభవించే బాధ ఇవన్నీ ఓ కుటుంబ నేపథ్యంలో తీశారు రాఘవేంద్రరావు.
అప్పటివరకు ఏవో సినిమాలు చేస్తూ వస్తున్న హీరో శ్రీకాంత్ కు ఒక్కసారిగా స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టింది. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే టైటిల్ తో రాఘవేంద్రరావు మరో సినిమా చేయనున్నట్టు ఈ రోజు వెలువడిన ప్రకటన టాలీవుడ్ లో ఓ సంచలనమైంది. ఈ చిత్రం సీక్వెల్ లో ఎవరు హీరోగా నటిస్తారా అన్న టాక్ ఆ మద్య తెగ హల్ చల్ చేసింది. ఈ నేపథ్యంలో రోషన్ పేరు బాగా వినిపిస్తోంది. హీరో శ్రీకాంత్ తనయుడే ఈ రోషన్.