దేవర సినిమా సాంగ్స్ అండ్ అప్డేట్స్ తో ఫుల్ జోష్ మీద ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మరొక హైప్ ఎక్కించే న్యూస్ అందరికి తెలిసిందే..ఎన్టీఆర్ తో KGF ‘సలార్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేస్తున్నట్లు చాలా కాలం క్రితమే ప్రకటించాడు. దీనిపై ఎప్పుడో అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ, ప్రభాస్‌తో సినిమాను రెండు పార్టులుగా చేయబోతుండడంతో ఇది ఆలస్యం అవుతోంది. దీనికితోడు ఎన్టీఆర్ కూడా దేవర తో బిజీగా ఉండడంతో ఈ సినిమాను మరింత ఆలస్యం అవుతూ వచ్చింది..కానీ ఎట్టకేలకు ఈరోజు ఈ సినిమా ఓఫిషల్ గ పూజ కార్యక్రమంతో స్టార్ట్ అయ్యింది..
హైదరాబాద్ లోని రామ నాయుడు స్టూడియోస్ లో కొద్దీ సేపటి క్రితమే సినిమా పూజను అందుకుంది..హై రేంజ్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుండి జరగనుంది..డ్రాగన్ అనే టైటిల్ ని కూడా పెట్టినట్టు సమాచారం..అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాను తెలుగుతో పాటు కన్నడంలోనూ రూపొందిస్తారని తెలుస్తోంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్ రామ్ నిర్మించబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరింత సమాచారం బయటకు రావాల్సి ఉంది..!!