సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే నందమూరి అభిమానులతో పాటు.. సినీప్రియలో కూడా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే త్వరలో సినిమాపై మరింత హైప్ పెంచేందుకు దేవర ట్రైలర్ లాంచ్ కు సిద్ధమయ్యారు టీం. ఇక ఈ ట్రైలర్ లంచ్ ప్రమోషన్స్ కోసం ప్రస్తుతం తారక్ ముంబైలో ఉన్నాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్.. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ను కటిశారు..
వీళ్ళిద్దరు కలిసి ముచ్చటించుకుంటున్న ఓ ఫోటో నెటింట తెగ వైరల్ గా మారడంతో ప్రస్తుతం ఈ పిక్ నెటింట చర్చనీయ అంశంగా మారింది. వీరిద్దరి కాంబోలో త్వరలోనే ఓ సినిమా రాబోతుందంటూ కొంతమంది చర్చించుకుంటుంటే.. మరి కొంత మంది మాత్రం ఇప్పట్లో వీరిద్దరికి కాంబోలో సినిమా వచ్చే అవకాశం లేదు.. ఇద్దరు సినిమాల లైనప్ ఫుల్ గా ఉంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇలాంటి టైంలో వీరి కాంబోలో సినిమా రావడం అసాధ్యం అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే విశ్వసనీయ సినీ వర్గాల సమాచారం ప్రకారం..నార్మల్‌గానే కలసి ముచ్చటించుకున్నారట. అంతేకానీ సినిమా రావడం లేదని టాక్..!!