in

jeevitha Rajasekhar’s daughter Shivani joins Udhayanidhi’s ‘Article 15’!

సీనియర్‌ హీరో రాజశేఖర్‌ ముద్దుల తనయ శివానీ రాజశేఖర్‌ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. తొలి చిత్రం విడుదలకాకముందే చక్కటి ఆఫర్లను చేజిక్కించుకోవడం విశేషమని చెబుతున్నారు. తెలుగులో ప్రస్తుతం ఈ యువనాయకి ‘డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు’ చిత్రంతో పాటు తేజ సజ్జాతో కలిసి ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. తమిళంలో హిప్‌హాప్‌ తమిళ సరసన ఓ సినిమా చేస్తోంది.

తాజాగా శివానీ రాజశేఖర్‌ తమిళంలో భారీ ఆఫర్‌ను సొంతం చేసుకుంది. హిందీలో విమర్శకులు ప్రశంసలందుకున్న సామాజిక సందేశాత్మక ‘ఆర్టికల్‌ 15’ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేస్తున్నారు. ఇందులో ఉదయనిధిస్టాలిన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. అరుణ్‌రాజ కామరాజ్‌ దర్శకుడు . బోనీకపూర్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో శివానీరాజశేఖర్‌ కీలక పాత్రలో నటించనుందని సమాచారం..

oka goppa drushya kavyam chuse avakasham kolpoina bharathiya prekshakulu!

Reward of Rs 1 lakh if ​​caught, Nidhi Agarwal Post Viral!