in

Janhvi Kapoor earns her biggest fee with Peddi!

రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రామ్ చరణ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నప్పటికీ, హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రెజెంటేషన్‌పై మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేవలం రెమ్యునరేషన్ కోసమే ఆమె ఈ పాత్ర చేసిందని విమర్శకులు సైతం అభిప్రాయపడుతున్నారు. దీంతో సినిమా విడుదల తర్వాత ఆమె ఎక్కడా ప్రమోషన్స్‌లో కనిపించలేదు. ఈ సినిమాకు జాన్వీ కపూర్ ఏకంగా రూ.8 కోట్ల పారితోషికం అందుకున్నట్లు సమాచారం..

అంతకుముందు నటించిన ‘దేవర’ చిత్రానికి రూ.5 కోట్లు తీసుకోగా, ఈ సినిమాకు ఆమె పారితోషికం దాదాపు రెట్టింపు అయింది. జాన్వీ పాత్రపై వచ్చిన నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ కారణంగా, దర్శకుడు బుచ్చిబాబు ఇప్పటికే ఆమెకు సంబంధించిన కొన్ని వివాదాస్పద సీన్లను థియేటర్ల నుండి తొలగించినట్లు తెలుస్తోంది..వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రం టాలీవుడ్‌లో మంచి వసూళ్లు సాధిస్తున్నప్పటికీ..ప్రస్తుతానికి జాన్వీ చేతిలో మరో తెలుగు సినిమా లేదు. ఆమె ప్రస్తుతం తన పూర్తి దృష్టిని బాలీవుడ్ ప్రాజెక్టులపైనే పెట్టి, అక్కడ బిజీగా గడుపుతోంది..!!

Hrithik Roshan likely to join Rajini’s Jailer 2!

Pooja Hegde opens up on the audience present mindset!