in

Anil Ravipudi working on an animated film based on the Ramayana!

నిల్ రావిపూడి నుంచి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ రాబోతోంది. ఇప్పటివరకు కమర్షియల్ ఎంటర్‌టైనర్లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు ఓ యానిమేషన్ సినిమా చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రామాయణం నేపథ్యంగా ఉండటం విశేషం. KVN సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. రామాయణంలోని ప్రధాన ఘట్టాలను ఒకే కథలో సమాహారంగా చూపించేలా ఈ యానిమేషన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌లో అసలు ప్రత్యేకత కథాంశంలోనే కాదు..అనిల్ రావిపూడి అనుసరిస్తున్న వర్కింగ్ స్టైల్‌లో ఉంది.

సాధారణంగా సినిమా కోసం దర్శకుడు ముందుగా స్క్రిప్ట్ సిద్ధం చేస్తారు. ఆ తర్వాత నటీనటులతో సన్నివేశాలను తెరకెక్కిస్తారు. కానీ ఈ యానిమేషన్ సినిమా కోసం అనిల్ రావిపూడి మరో అడుగు ముందుకేశారు. స్క్రిప్ట్‌తో పాటు ప్రతి సీన్‌ను ఎలా డిజైన్ చేయాలి? పాత్రలు ఎలా కనిపించాలి? డైలాగ్ చెప్పే సమయంలో ఎలాంటి హావభావాలు ఉండాలి? సన్నివేశంలోని ఎమోషన్ ఎలా ఉండాలి? అనే విషయాలను స్వయంగా పెర్ఫార్మ్ చేసి రికార్డ్ చేశారు. అంటే..దర్శకుడిగా సీన్‌ను వివరించడం మాత్రమే కాకుండా, ఆయా పాత్రల హావభావాలు, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌ను కూడా తన పెర్ఫార్మెన్స్ ద్వారా యానిమేటర్లకు రిఫరెన్స్‌గా అందిస్తున్నారు. దాని ఆధారంగానే యానిమేటర్లు ప్రతి సన్నివేశాన్ని డిజైన్ చేస్తున్నారు..!!

Faria Abdullah Breaks Silence on ‘Kafir’ Trolls Over Bonalu Dance!