
రజినీకాంత్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘జైలర్ 2’ గురించి ఒక సంచలన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది..
ఈ సినిమాలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపిస్తారని గతంలో ప్రచారం జరిగినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ కామియో రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే..‘భగవాన్ దాదా’ 1986 చిత్రం తర్వాత, దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం రజినీకాంత్, హృతిక్ రోషన్ కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. ఈ బాలీవుడ్ స్టార్‌కి సంబంధించిన కీలక సన్నివేశాలను జూన్ 22, 23 తేదీల్లో చెన్నైలో చిత్రీకరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది..!!

