in

Janhvi Kapoor: blessed to act with jr ntr for ‘devara’

తాజా చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘దేవర’ చిత్రంలో పోషిస్తోన్న పాత్ర గురించి మాట్లాడారు.’ ఈ సినిమాలో ‘తంగం’ పాత్ర పోషిస్తున్నాను. అది ఎంతో వినోదాత్మకంగా ఉంటుంది. ఇప్పటి వరకు చేసిన షూటింగ్‌ చాలా సరదాగా జరిగింది. సెట్‌లోని వారంతా నాపై ఎంతో ప్రేమగా ఉంటారు. చిత్రయూనిట్‌ అంకితభావానికి ఆశ్చర్యపోయాను. ఇది విభిన్నమైన కథ. అందంగా, ప్రత్యేకంగా ఉంటుంది.

‘దేవర’లో అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంత మంచి చిత్రంలో నటించే అవకాశమిచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు’ అని చెప్పారు. తాజాగా ఈ సినిమాలో తొలి పాటను విడుదల చేయగా దానికి మంచి ప్రేక్షకాదరణ లభించింది. త్వరలోనే రెండో పాట విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామా ఇది..!!

Krish to direct his kanche hero Varun Tej again?

Tamil producer manikyam sensational comments on Meena!