in

Janhvi Kapoor bags another South film to romance Akhil?

యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని బ్యారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది. రాధేశ్యామ్, సాహో సినిమాలకి రైటర్ గా పనిచేసిన అనిల్ కుమార్ ని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చెబుతున్నారు. 50 కోట్లకి పైగా బడ్జెట్ తోనే ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారంట. ప్రస్తుతం ఈ మూవీకి సంబందించిన క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో దర్శకుడు ఉన్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ దేవర సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు Akhil 6 కోసం జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నారంట. దీర టైటిల్ తో ఈ చిత్రం తెరకెక్కుతుందని తెలుస్తోంది.

ఇక పాన్ ఇండియా లెవల్ లో దేవర తర్వాత జాన్వీ కపూర్ చేయబోయే మూవీ ఇదే అని టాక్. అతిలోక సుందరి కూతురుగా అడుగుపెట్టిన జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఇంకా కమర్షియల్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోలేదు. అలాగే కింగ్ నాగార్జున వారసుడిగా వస్తోన్న అఖిల్ కూడా పూర్తిస్థాయిలో తనని స్టార్ గా ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయాడు. నాగార్జున, శ్రీదేవి మాత్రం కలిసి రెండు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మరి వారి వారసత్వంతో వస్తోన్న జాన్వీ కపూర్, అఖిల్ కి ధీర మూవీ ఎలాంటి హిట్ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..!!

happy birthday mm keeravani!

Payal Rajput’s Sensational Comments On Telugu Directors!