ఇటీవల కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సస్ అవడంతో ఖరీదైన బహుమతులు కూడా అందుకున్నాడు రజనీకాంత్. రజనీకాంత్ కు బిఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చాడు నిర్మాత కళానిధి మారన్. అలాగే దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుద్ కి కూడా ఖరీదైన కారులను కానుకగా అందించాడు. ఈ మూవీ సక్సస్ తో అనుకున్న దానికంటే లాభాలు మూడింతలు ఎక్కువగా రావడంతో నిర్మాత తన ఆనందాన్ని మొత్తం మూవీ టీం అందరితో పంచుకోవాలనుకున్నాడు.
జైలర్ బోనస్ ప్రక్రియను రజినీకాంత్, నెల్సన్, అనిరుద్తో ముగించకుండా ఈ సినిమాలో వర్క్ చేసిన 300 కు పైగా యూనిట్ సభ్యులకు కూడా బంగారు నాణాన్ని అందించాడు. చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ స్పెషల్ ఈవెంట్లో జైలర్ సినిమా కోసం పని చేసిన 300 మందికి పైగా యూనిట్ సభ్యులకు గోల్డ్ కాయిన్స్ గిఫ్టుగా బహుకరించాడు. ఆ కాయిన్స్ పై ఓ వైపు జైలర్ అని ముద్రించాడు. మరోవైపు సన్ పిక్చర్స్ లోగో పెట్టాడు. ఇలా 300 మందికి పైగా ఈ కాయిన్స్ అందించి జైలర్ సినిమా హిట్ పాట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు..!!