in

golden leg Samyuktha Menon Zeroed In For Nikhil’s ‘Swayambhu’!

సార్, విరూపాక్ష లాంటి హిట్ సినిమాలతో గోల్డెన్ లెగ్ గ మారింది మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్, తాజాగా తనకు మరో అవకాశమా తట్టింది. టాలీవుడ్ లో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాల్లో ‘స్వయంభు’ ఒకటి. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా అని సమాచారం. తాజాగా సంయుక్త మీనన్ పుట్టిన రోజు సందర్భంగా తనకి విష్ చేస్తూ చిత్ర యూనిట్ ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. అయితే ఫస్ట్ లుక్ అంటే మామూలుగా ఆ నటీనటులకు చెందిన స్టిల్స్ మాత్రమే ఉంటాయి. కానీ వీళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్ లో సంయుక్త మీనన్ కి బదులు ఒక శిల్పం లుక్ రిలీజ్ చేసారు.

ఇక ఆ లుక్ సంయుక్త మీనన్ దేనని తెలుస్తూనే ఉంది. అయితే రిలీజ్ చేసిన ఆ పోస్టర్ ని బట్టి సంయుక్త మీనన్ స్వయంభు లో ఒక రాజకుమారి పాత్ర లో నటిస్తుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. లేకపోతే ఒక దేవకన్య రోల్ కూడా అయి ఉండవచ్చు అని అనిపిస్తుంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. అయితే సినిమా మాత్రం ఓ రేంజ్ లో ఉండబోతుందని వస్తున్న అప్డేట్స్ ని బట్టి తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో సంయుక్త స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ లు పుష్కలంగా ఉన్నాయి..!!

happy birthday AMALA AKKINENI!

N.T.R NI BOLTHA KOTTINCHINA BHANUMATHI