in

9 movies 8 flops, Nidhhi Agerwal’s struggle with big stars!

వన్ కళ్యాణ్ సరసన ‘హరి హర వీరమల్లు’ సినిమా చేసే అవకాశం రావడంతో ఆ సినిమా విడుదల అయ్యే వరకు మరో సినిమా చేయకూడదని నిర్మాత ఏయం రత్నం కండిషన్ పెడితే అగ్రిమెంట్ మీద సంతకం చేశారు నిధి అగర్వాల్. అది ఆమె పాలిట శాపం అయ్యింది. పవన్ పొలిటికల్ షెడ్యూల్స్ వల్ల సినిమా ఆలస్యం అయ్యింది. దాంతో మరొక సినిమా చేసే ఆస్కారం లేకుండా పోయింది. రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ‘ది రాజా సాబ్’ సినిమా చేసే ఛాన్స్ వస్తే ఏయం రత్నం నుంచి అనుమతి తీసుకుని మరీ చేయాల్సి వచ్చింది. ఆ రెండు సినిమాలు విడుదలకు దగ్గర పడిన తరుణంలోనూ కొత్త సినిమాలకు సంతకాలు చేయలేదు నిధి అగర్వాల్.

‘హరి హర వీరమల్లు’, ‘ది రాజా సాబ్’..రెండు సినిమాలపై నిధి అగర్వాల్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆ రెండూ హిట్ అయితే తన దశ తిరుగుతుందని ఆమె భావించారు. అయితే..ఆ రెండూ డిజాస్టర్లు కావడంతో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితిలో నిధి అగర్వాల్ ఉన్నట్టు సమాచారం. సంక్రాంతికి రాజా సాబ్ విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలలో మూడు కొత్త సినిమాలకు తాను సంతకం చేసినట్టు చెప్పారు. అయితే..ఆ సినిమాలు ఇప్పటికీ సెట్స్ మీదకు వెళ్ళలేదు. త్వరలో ఆమె కథానాయికగా సినిమాలు మొదలు అయ్యే సూచనలు ఏవీ కనిపించడం లేదు. దాంతో నిధి కెరీర్ గందరగోళంలో పడిందని ఇండస్ట్రీ గుసగుస..!!

Fahadh Remuneration Tollywood Producer

Fahadh Faasil’s Remuneration Shocks Tollywood Producer

happy birthday allu arjun!