in

it’s Official, Trivikram to produce Naveen Polishetty’s Next!

జెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ‌, జాతిర‌త్నాలు సినిమాల‌తో.. తెలుగు ప్రేక్ష‌కులపై చెర‌గ‌ని ముద్ర వేశాడు న‌వీన్ పొలిశెట్టి. రెండు సినిమాల‌తోనే టాలీవుడ్ లోనే క్రేజియ‌స్ట్ హీరో అయిపోయాడు. ఇప్పుడు ఏకంగా త్రివిక్ర‌మ్ తో సినిమా చేసేస్తున్నాడు. అవును… అయితే ఈ సినిమాని త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడు కాదు. నిర్మాత మాత్ర‌మే. న‌వీన్ పొలిశెట్టి హీరోగా క‌ల్యాణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. దీనికి సాయి సౌజ‌న్య నిర్మాత‌.

సాయి సౌజ‌న్య అంటే ఎవ‌రో కాదు. త్రివిక్ర‌మ్ భార్య‌. ఆమెని ఈ సినిమాతో త్రివిక్ర‌మ్ చిత్ర‌రంగంలో దింపాడ‌న్న‌మాట‌. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, హారిక హాసిని సంస్థ‌లు.. త్రివిక్ర‌మ్ సొంత సంస్థ‌ల్లాంటివి. ఈ బ్యాన‌ర్‌లో ఏ సినిమా వ‌చ్చినా, అందులో త్రివిక్ర‌మ్ కి వాటా ఉంటుంది. త్రివిక్ర‌మ్ సినిమాల‌న్నింటికీ వీళ్లే నిర్మాత‌లు. అయితే సొంతంగా ఓ బ్యాన‌ర్ స్థాపించాల‌ని త్రివిక్ర‌మ్ ఎప్ప‌టి నుంచో భావిస్తున్నాడు. అలా… న‌వీన్ పొలిశెట్టితో త్రివిక్ర‌మ్ నేరుగా నిర్మాణ రంగంలో అడుగుపెట్టాడ‌న్న‌మాట‌.

nikesha patel latest stills in black short dress!

BBT5’s evicted contestant Sarayu accuses Shanmukh’s fans for abusing her!