ఇలియానా తన అందాలను ఆరబోసింది. పోకిరి పిల్ల తన వంటి వొంపులు ఎలా ఉంటాయో చెప్పింది. అందంగా లేనంటూనే తన శరీర సౌష్ఠవాన్ని తెగ మెచ్చుకున్నది. ఇలియానా షేప్ అంత అట్రాక్టివ్‌గా ఉండదని కొన్నాళ్ల క్రితం బాడీషేమింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత ఆమె కొంత డిప్రెషన్‌కు లోనైంది. కానీ ఇప్పుడు ఆ సీన్ మారినట్లు తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పకనే చెప్పిందామె. తన శరీరంలోని ప్రతి అవయం ఎలా ఉంటుందో.. ఇన్‌స్టాలో ఇలియానా తేటతెల్లంగా వివరించింది.
తాజాగా దిగిన బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫోటోను పోస్టు చేసింది. లోపాలు ఉన్నట్లు బాధపడినా.. ఆ లోపాలే ఆమెకు అందాలంటూ కామెంట్ చేసింది. ఎత్తులేనని, ఎదగలేదని, పర్ఫెక్ట్‌గా లేనని ఆరోపణలు ఉన్నా.. తన అందాలన్నీ అద్భుత లోపాలన్నట్లు ఇలియానా తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. శరీరంలోని ప్రతి చిన్న లోపం తనను మరీ మరీ అందంగా మలిచినట్లు ఒప్పేసుకున్నది. అందుకే బ్యూటీ గురించి మాట్లాడడం మానేసానని, మరీ ఫిట్‌గా ఉండాలన్న తపన కూడా లేదని, తన సహజసిద్ధమైన అందాలే తనకు అట్రాక్షన్ అని ఇలియానా తన పోస్టులో వివరించింది.