తొలిసారి నిజంగా లిప్ కిస్ పెడితే ఆ అనుభవం ఎలా ఉంటుందో ‘కమిట్ మెంట్’ సినిమా ద్వారా తెలుసుకున్నానని చెప్పింది. ‘నేను గతంలో ఫేక్ కిస్ లు పెట్టాను. కానీ ఈ సారి మాత్రం నిజంగా కిస్ సీన్ లో నటించాను. నేను కిస్ చేసిన వ్యక్తి నాకు తెలిసినవాడే. నేను మృదుస్వభావి కాదు. నేను తెలుగమ్మాయిని. నా ఇష్టప్రకారం నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నా. కానీ మొదటి పెళ్లి చూపులు రద్దయ్యాయి. ఆ తర్వాత మూడ్ మారిపోయింది.
నేనిపుడు మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. పెళ్లి నాకు అడ్డంకుగా మారుతుందని అభిప్రాయానికి వచ్చాను. ఆర్టిస్టుగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నా. జీవితంలో నేను పెళ్లి చేసుకోను. పెళ్లి కాకుండా బాయ్‌ఫ్రెండ్‌ను మెయింటైన్ చేయడం తప్పని నేననుకోవడం లేదు. నేను సన్యాసిని కాదు. కాబట్టి నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. నేను గతంలో ఇద్దరితో పదేండ్లు డేటింగ్ లో ఉన్నాను. నేనిప్పుడు చాలా పరిణితి సాధించిన వ్యక్తినంటూ’ చెప్పుకొచ్చింది తేజస్వి.