
టాలీవుడ్ హీరోయిన్ గోవా బ్యూటీ ఇలియాన తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించింది. అయితే ఇలియాన కొంతకాలంగా తన చిరకాల మిత్రుడు ఆండ్రూ నీబోన్ తో రిలేషన్ షిప్ మెంటైన్ చేసింది. అయితే ఇటీవలే విడిపోయినట్లు ఆమె చెప్పిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రఫర్ ఆండ్య్రూతో పీకల్లోతు ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్న తర్వాత విడిపోయింది. తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిన తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది ఈ బామ. అదే సమయంలో తనకు చనిపోవాలనిపించిందని తాజాగా చెప్పుకొచ్చింది. ఆత్మహత్యకు కూడా ప్రయత్నించిందట. దీనికి కారణం పీకల్లోతు మునిగిన తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోవడమేనట. వ్యక్తిగత జీవితంలో తాను విఫలమయ్యానని డీప్రెషన్ తో ఓ రోజు ఏకంగా 12 పవర్ ఫుల్ నిద్రమాత్రలు కూడా మింగానని చెబుతుంది ఈ భామ.

