in

‘I Am Gonna Screw Them Up’ jhanvi kapoor warns trollers!

దివంగ‌త అల‌నాటి అందాల తార శ్రీదేవి త‌న‌య‌గా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీక‌పూర్. త‌ల్లికి త‌గ్గ కూతురుగా పేరు తెచ్చుకునే ప‌నిలో బిజీగా ఉంది జాన్వీక‌పూర్. ఇక శ్రీదేవి-బోనీక‌పూర్ రెండో కూతురు ఖుషీక‌పూర్ కూడా జోయా అఖ్త‌ర్  తెర‌కెక్కిస్తున్న ది ఆర్చీస్ తో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. అయితే త‌న సోద‌రి వ‌ర్క్ గురించి చెప్పుకొచ్చింది జాన్వీక‌పూర్..ఖుషీ గురించి మాట్లాడుతూ..నేను ఆమె (ఖుషీ క‌పూర్‌) ప‌ని చూశాను. చాలా క‌ఠినంగా హార్డ్‌వ‌ర్క్ చేస్తుంది. ఆమె డెడికేష‌న్ చూసి చాలా సంతోషంగా ఉన్నానంది. అయితే ఖుషీనుద్దేశించి ఎవ‌రైనా ఎలాంటి ట్రోలింగ్స్ నైనా చేస్తే స‌మ‌ర్థించ‌బోనంటోంది జాన్వీక‌పూర్‌.

ఖుషీ గురించి ఎవ‌రైనా ఏదైనా చెడుగా మాట్లాడితే..వారిని చిత్తు చేస్తానంటోంది. లైవ్ యాక్ష‌న్ మ్యూజిక‌ల్ సినిమాగా వ‌స్తున్నది ఆర్చీస్ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌న‌వ‌డు అగ‌స్త్య నందా మ‌రో లీడ్ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో సూప‌ర్ 30 ఫేం మిహిర్‌ అహూజా, డాట్‌, యువ‌రాజ్ మెండా, వేదాంగ్ రైనా ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. జాన్వీక‌పూర్ మెయిన్ రోల్‌లో న‌టించిన గుడ్ లక్ జెర్రీ చిత్రం ట్రైల‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది. క్రైం కామెడీ డ్రామా నేప‌థ్యంలో వ‌స్తున్న ఈ సినిమాకు సిద్దార్థ్ సేన్ గుప్తా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. జులై 29 విడుద‌ల కానుంది.

Producer Dil Raju Stops his 10 New Projects!

poorna turns the evil woman for nani’s ‘dasara’!