కెరీర్ ప్రారంభంలో ‘ఉయ్యాల జంపాల’ ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ పునర్నవి భూపాలం కు పెద్దగా కలిసొచ్చిందేమి లేదు. అయితే గతేడాది ‘బిగ్ బాస్3’ ద్వారా ప్రేక్షకులను అలరించి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. ’18-19 ఏళ్ళ వయసులో ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య పుట్టే ప్రేమే చాలా స్వచ్చమైనది.అలాంటి ప్రేమే నాకు నచ్చుతుంది. ఓల్డ్ అథంటిక్ లవ్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఒకరంటే ఒకరికి ఇష్టం.. ఒకరికోసం ఒకరు కావాలని అనిపిస్తుంది.. ప్రేమను ఇచ్చాము అంటే మళ్లీ తీసుకోవాలని అనిపిస్తుంది. అలాంటి ప్రేమ నాకు ఇష్టం. దాన్నే నేను నమ్ముతాను.కానీ ఈ కాలంలో అలాంటి ప్రేమ దొరకడం లేదు.
నిజమైన ప్రేమను వెతుక్కోవడం అనేది చాలా కాంప్లికేటెడ్ గా తయారవ్వుతుంది.దాని వల్ల నిజమైన ప్రేమ దొరకదు అని నేను చెప్పడం లేదు కానీ.. ఏదో ఒక రోజు దొరుకుతుందిలే.. అని ఎదుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి నన్ను భరించాలి. నాలో సిక్స్ షేడ్స్ మాత్రమే చూసారు కానీ నాలో 70 షేడ్స్ ఉన్నాయి.కాబట్టి నన్ను.. నా లైఫ్‌ని అర్థం చేసుకోవాలి. నేను ఇండిపెండెంట్ ఉమెన్‌గా ఉండాలని అనుకుంటున్నా.. పెళ్లైన తరువాత కూడా పనిచేస్తా. నా పనిని అతను గౌరవించాలి’ అంటూ పునర్నవి చెప్పుకొచ్చింది.