in

hot sensation Malavika Mohanan Clarifies Her ‘Lady Superstar’ Comment!

యనతార..దక్షిణాదిలో లేడి సూపర్‌స్టార్‌గా, హీరోలకు మించిన స్టార్‌డమ్‌తో దూసుకెళ్తున్న నటీమణి. ఈమె కాల్షీట్లు ఇస్తే అదే భాగ్యమని భావించే దర్శక నిర్మాతలు కోకొల్లలు. పెళ్లయినప్పటికీ నయన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతూనే వున్నాయి.. కొన్ని క్యారెక్టర్ల ఆమె కోసమే పుడుతున్నాయి. నయనతార వైభోగం చూసి ఆమె సమకాలీన హీరోయిన్లు, కుర్ర హీరోయిన్లు కుళ్లుకుంటూ వుంటారు. ఇదిలావుండగా ప్రస్తుతం నయనతార- మాళవికా మోహన్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. దీంతో మాళవికపై నయన్ అభిమానులు భగ్గుమంటున్నారు.

అసలేం జరిగిందంటే..మాళవిక తాజా చిత్రం ‘‘క్రిస్టి’’ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో తనకు ‘‘లేడీ సూపర్‌స్టార్’’ అని పదం నచ్చదని, హీరోయిన్లను కూడా హీరోలకు మాదిరే సూపర్‌స్టార్‌గా అభివర్ణించాలని మాళవిక అన్నారు. ఈ వ్యాఖ్యలు నయన్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి.. తమ అభిమాన నటిని ఉద్దేశించే మాళవిక ఈ వ్యాఖ్యలు చేశారంటూ.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. వివాదం పెద్దదిగా మారుతున్న నేపథ్యంలో మాళవిక స్పందించారు. తాను ఏ ఒక్క హీరోయిన్‌ను ఉద్దేశించి మాట్లాడలేదని.. తనకు నయనతార అంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. ఆమె నుంచి ఓ నటిగా ఎంతో స్పూర్తి పొందుతానని మాళవిక చెప్పారు.

18 years for ‘Sankranti’!

release date locked for Prabhas, Deepika Padukone ‘project k’!