in

release date locked for Prabhas, Deepika Padukone ‘project k’!

ప్రభాస్ ప్రాజెక్ట్ కే సినిమాను పాన్ వరల్డ్‌ లెవెల్లో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం వైజయంతీ మూవీస్ లెక్కలేనంతగా ఖర్చు పెడుతోంది. కొత్త టెక్నాలజీని వాడుతోంది. నాగ్ అశ్విన్ ఏదో కొత్త ప్రపంచాన్ని సృష్టించినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు మహా శివరాత్రి సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి అంటే జనవరి 12న ఈ సినిమా థియేటర్లో సందడి చేయబోతోంది. మహానటి తరువాత నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దీనిపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి.

ఈ సినిమా కోసం మహింద్రా కంపెనీ నుంచి సపరేట్‌గా ఇంజనీర్లు రావడం, సినిమా కోసం ప్రత్యేకంగా కార్లను తయారు చేయించడం చూస్తుంటే నాగ్ అశ్విన్ విజన్ ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. హాలీవుడ్‌ సినిమాలకు ధీటుగా ఈ చిత్రం ఉండబోతోందని చెప్పకనే చెప్పేస్తున్నారు. ఇది పాన్ వరల్డ్ సినిమాగా వస్తోందంటూ నాగ్ అశ్విన్ ఇది వరకే ఎన్నో సార్లు చెప్పేశాడు. మామూలుగా అయితే ఈ సినిమాను ఈ ఏడాది దసరాకే విడుదల చేయాలని అశ్వనీదత్ అనుకున్నాడు. దసరా ప్లస్ ప్రభాస్ బర్త్ డే కలిసి వస్తుందని ఆశించాడు. కానీ ఇప్పుడు కొత్త డేట్‌ను ప్రకటించేశారు మేకర్లు..!!

hot sensation Malavika Mohanan Clarifies Her ‘Lady Superstar’ Comment!

will this bold act change ananya nagalla’s fate?