in

Anikha Surendran opens up about lip lock controversy!

బాలనటిగా పలు చిత్రాల్లో కనిపించిన అనిఖా సురేంద్రన్ ‘బుట్ట బొమ్మ’ మూవీతో హీరోయిన్ గా తెలుగులోకి తెరంగేట్రం చేసింది. మలయాళ చిత్రం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అనిఖా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ మలయాళంలో నటించిన సినిమా ‘ఓ మై డార్లింగ్’. ఇందులో అనిఖా ముద్దు సీన్లతో అభిమానులకు షాకిచ్చింది. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ లో అనిఖాను చూసి సినీ అభిమానులు ముక్కున వేలేసుకున్నారు.

తాజాగా ఈ విమర్శలపై నటి అనిఖా వివరణ ఇచ్చింది…“ఓ మై డార్లింగ్’ అనేది కంప్లీట్ గా రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందింది. ఇందులో ముద్దు సీన్లు కచ్చితంగా ఉండాల్సిందే. అవి లేకుండా సినిమా ఉండదు. దర్శకుడు తనకు స్క్రిప్ట్‌ చెప్పేటప్పుడు సన్నిహిత సన్నివేశాల ఇంపార్టెన్స్ కూడా చెప్పాడు. కథకు అవసరమైన సన్నివేశాల్లో మాత్రమే రొమాంటిక్ సీన్లు చేశాను. అయితే, ఈ సీన్లలో ఎలాంటి అశ్లీలత కనిపించదు. సినిమా చూసినప్పుడు ప్రేక్షకులకు ఈ విషయం అర్థం అవుతుంది” అని అనిఖా వివరించింది..!!

NTR 30 EXCLUSIVE: hot beauty Janhvi Kapoor locked

sir!