గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హనీ రోజ్.. ఈ ముద్దుగుమ్మ బాలయ్య నటించిన వీర సింహారెడ్డి చిత్రంలో మరదలి పాత్రలో తల్లిపాత్రలో అద్భుతంగా నటించింది.. ఈ సినిమా వల్లే సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ సినిమా ముందు వరకు మాత్రం హాని రోజ్ ఎవరని విషయం చాలామందికి తెలియకపోవచ్చు. దీంతోపాటుగా హాని రోజ్ పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్కు కూడా విపరీతంగా వెళుతోంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా హనీ రోజ్.. తను ఎదుర్కొన్న బాడీ షేమింగ్ ట్రోల్స్ వంటి వాటిపైన స్పందించింది..హని రోజ్ మాట్లాడుతూ..ఎప్పుడు తనపైన రోజు జరుగుతూనే ఉంటాయని అయితే.. ఇందులో కొన్ని ట్రోల్స్ నవ్వు తెప్పిస్తాయి మరికొన్ని మాత్రం మనసుకు బాధ కలిగించేలా ఉంటాయని ముఖ్యంగా తన శరీరాకృతి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుందని తెలిపింది.
అయితే ఇలాంటివి ఇప్పుడు అసలు పట్టించుకోలేదని తెలిపింది.. అయితే గతంలో ఒక టీవీ షో కి వెళ్ళినప్పుడు ఒక కమెడియన్ నన్ను బాడీ షేవింగ్ చేస్తూ మాట్లాడారని ఆ మాటలు విని యాంకర్ గట్టిగా నవ్వేసిందని.. కానీ అక్కడున్న మహిళ యాంకరే తన మీద వచ్చిన కామెంట్లు విని నవ్వడం నచ్చలేదని.. అతడు బాడి షేమింగ్ చేసిన కామెంట్లు టీవీలో ఎలా ప్రసారం చేస్తున్నారో ఇప్పటికీ అర్థం కావడంలేదని తెలియజేస్తోంది హనీ రోజ్.