in

Heroine Pooja Hegde’s house tragedy!

తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట విషాదం నెలకొంది. తాను అమితంగా ప్రేమించే భామ్మగారు మరణించారు. ఈ విషయాన్ని పూజా స్వయంగా వెల్లడించారు. తాను ఎక్కడ ఉన్నా అక్కడ ఎలాంటి బాధలు లేకుండా సంతోషంగా హాయిగా ఉండాలని పూజా కోరుకుంది. ఈ క్యూటీని మేం కోల్పోయాను.. కష్టాలలో ఉన్నా నవ్వుతూనే ఉండాలని ఆమె మాకు నేర్పించింది భామ్మ. ధైర్యంగా ఉండాలని ఉద్భోధించింది.

కావాల్సిన వారి కోసం ఈగోల్ని వదిలిపెట్టాలని నేర్పించింది. తాను మా మధ్య లేకపోయినా నాతోనే ఉంటుంది. లవ్ యు ఆజీ..! అంటూ దుఃఖ సాగరంలో మునిగిపోయింది పూజా. షూట్ టైమ్ లో ఫోన్లు చేసి, ఏం చేస్తున్నావ్, ఎలా ఉన్నావ్, అని నువ్వడిగే ప్రశ్నల్ని కాల్స్ ని మిస్సవుతున్నాను భామ్మా, అని ఆవేదనకు గురైంది పూజా నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని అన్నారు..

Tuck Jagadish Teaser, Nani, Ritu Varma!

Pawan Kalyan Welcomes Himaja on Sets With Handwritten Letter!