పుష్పతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చాక అల్లు అర్జునే కాదు ఏ హీరో అయినా మల్టీస్టారర్లు చేసే విషయంలో జాగ్రత్తగా ఉంటారు. రాజమౌళి అంతటి వాడే బ్యాలన్స్ చేసే విషయంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇద్దరిని పూర్తి స్థాయిలో సంతృప్తిపరచలేక పోయాడు. అలాంటిది బన్నీతో వేరే హీరో కాంబో అంటే ఏ మాత్రం తేడా కొట్టినా ఫలితం అటుఇటు అయిపోతుంది.
నో చెప్పడానికి ఇది ప్రధాన కారణమని అంతర్గతంగా వినిపిస్తోంది. దీన్నే తీసుకెళ్లి సల్మాన్ ఖాన్ కు చెప్పి ఒప్పించి సన్ పిక్చర్స్ నిర్మాణంలో తీసేందుకు అట్లీ సర్వం సిద్ధం చేశాడని చెన్నై టాక్. సల్మాన్ ఖాన్ కు మరో స్టార్ ఉంటే పెద్దగా అభ్యంతరాలు ఉండవు. ఇప్పుడు మెయిన్ హీరో తనే కాబట్టి సెకండ్ రోల్ కోసం అట్లీ దక్షిణాదిలో ఎవరైనా పెద్ద హీరోని సెట్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది..!!