in

hattrick of flops for happening beauty sreeleela!

శ్రీలీల..ధమాకా సినిమాతో పెద్ద బ్రేక్ అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే మోస్ట్ బిజీ హీరోయిన్ గా తాను ఇప్పుడు నిలిచింది. పైగా ఆమె ఉంటే సినిమా హిట్ అవుతుంది అనే సెంటిమెంట్ కూడా ఒకటి. కానీ సీన్ కట్ చేస్తే ఈ సెంటిమెంట్ బ్రేక్ అవ్వడానికి ఏడాది కూడా పట్టలేదు. గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన ధమాకా చిత్రం తర్వాత ఆమె నుంచి చాలా సినిమాలు వచ్చాయి. ఈ జస్ట్ నాలుగు నెలల్లోనే నాలుగైదు సినిమాలు ఆమె నుంచి వస్తే ఏది కూడా హిట్ బాట పట్టలేదు.

మధ్యలో బాలయ్య భగవంత్ కేసరి పర్వాలేదు అనిపించింది కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం దానికీ నష్టాలు తప్పలేదు. పైగా కొన్ని వారాల కితమే వచ్చిన ఆదికేశవ ఓ డిజాస్టర్ అయితే మళ్ళీ దీని తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన “ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్” సినిమా కూడా ప్లాప్ అయ్యి కూర్చుంది. దీనితో వరుసగా ఆమె ఇప్పుడు ప్లాప్ లు ఎదుర్కొంటుంది. సో ఇలా ఇంకా ఆమెకి బ్యాడ్ టైం నే నడుస్తుంది అని చెప్పాలి. మరి జనవరిలో గుంటూరు కారం సినిమా ఉంది. అది ఏమన్నా ఆమె ఫేట్ మారుస్తుందేమో చూడాలి..!!

pooja hegde realizes her mistake!

Samantha launches her own production house ‘Tralala’!