in

Hattrick combo joining hands, Gopichand with Ravi Teja!

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లు, హీరోల కాంబినేషన్ కలిస్తే ఇక ఆ సినిమా హిట్ అనే టాక్ వచ్చేస్తుంది. ఇది ముందునుంచీ ఉన్న సాంప్రదాయమే. అలాంటి కాంబోలు టాలీవుడ్ లో చాలా ఉన్నాయి. అలాంటి కాంబోలలో రవితేజ-గోపిచంద్ మలినేని కాంబో కూడా ఒకటి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే మూడు సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో మరో వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. రవితేజతో హ్యాట్రిక్ హిట్స్ అందించిన గోపించంద్ మలినేని ఇప్పుడు మరోసారి రవితేజతో మూవీ చేయనున్నాడట.

ఇప్పుడీ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా తర్వాత వెంటనే రవితేజ గోపిచంద్ సినిమాకు ఓకే చెప్పాడట. ఇప్పటికే రవితేజ-గోపిచంద్ నుంచి వరుసగా ‘డాన్ శీను’, ‘బలుపు’, ‘క్రాక్’ వంటి మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు రవితేజకు మంచి బ్లాక్ బస్టర్స్ ను అందించాయి..!!

can thamanna repeat kiara advani’s magic?

bubbly beauty rashi khanna’s bad situation!