in

Harish Shankar gets green signal from Megastar!

సిల్వర్‌ స్క్రీన్‌పై కొన్ని కాంబినేషన్స్‌ రాబోతున్నాయంటే క్రేజ్‌ మామూలుగా ఉండదు. అలాంటి కాంబో మెగాస్టార్‌ చిరంజీవి -హరీష్‌ శంకర్‌. చాలా రోజుల క్రితమే ఈ ఇద్దరు ఓ సినిమా చేయబోతున్నారంటూ నెట్టింట వార్త తెరపైకి వచ్చిందని తెలిసిందే. అయితే మళ్లీ ఎలాంటి అప్‌డేట్‌ బయటకు రాలేదు. తాజాగా చిరు ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడన్న వార్త ఫిలింనగర్‌ సర్కిల్‌లో రౌండప్‌ చేస్తోంది. హరీష్‌ శంకర్‌ ఇటీవలే చిరంజీవికి డ్రాప్ట్‌ను వివరించగా.. ఓకే చెప్పాడట.

అంతేకాదు ఈ చిత్రాన్ని పీపుల్‌ విూడియా ఫ్యాక్టరీతో కలిసి సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మించనుందని ఇన్‌సైడ్‌ టాక్‌. ఇదే విషయాన్ని త్వరలోనే ప్రకటించనున్నారట మేకర్స్‌. చిరంజీవి ప్రస్తుతం టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న చిత్రం ‘విశ్వంభర’. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్‌ దశలో ఉంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో త్రిష ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది..!!

choose your actors for ‘Kalki 2898 AD’ characters!

2 heroines for Venkatesh, Anil Ravipudi crime entertainer!