in

hari Teja reveals her delivery problems with corona!

తాజాగా చాలా రోజుల తర్వాత ఒక వీడియో ద్వారా అభిమానులను పలకరించారు.ఇన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండడానికి గల కారణాలను కూడా ఆమె ఈ వీడియో ద్వారా వివరించారు. డెలివరీకి ఒక వారం ముందు రోజులు తన కరోనా బారిన పడ్డానని, అదే సమయంలో ఇంట్లో వాళ్లకు కూడా పాజిటివ్ రావడంతో డెలివరీ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఆమె తెలిపారు.కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్ రావడంతో డెలివరీ ఒక్కదాన్నే వెళ్లి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఈ వీడియో ద్వారా హరితేజ వివరించారు.

నేను పడిన ఇబ్బంది ఏ ఒక్కరు పడకుండా ఉండటం కోసం ఈ వీడియో ద్వారా మరికొందరు అయిన జాగ్రత్తలు తీసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నట్లు ఆమె తెలిపారు. రెగ్యులర్ చెకప్ చేసే డాక్టర్ తనకు కరోనా ఉండటంవల్ల డెలివరీ చేయనని చెప్పడంతో కోవిడ్‌ ఆస్పత్రులను సంప్రదించా. నాకు పాజిటివ్‌ కాబట్టి బేబీకి కూడా వస్తుందని భయపడ్డాను. అన్ని రకాల టెస్టులు చేయించుకున్నాను. రిపోర్టుల కోసం రాత్రులు ఎదురు చూస్తూ ఎంతో ఇబ్బంది పడ్డానని తెలిపారు.

33 YEARS FOR YAMUDIKI MOGUDU!

Terrific TRP Ratings For ‘Uppena’!