in

happy birthday nabha natesh!

టాలీవుడ్ లో కొత్తతరం భామ అయిన నభ నటేష్ ఈమధ్యే ‘ఇస్మార్ట్ శంకర్’ తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.  ఈ సినిమా విజయంతో కొత్త ఆఫర్లు నభను వెతుక్కుంటూ వచ్చాయి. ఇప్పుడు పలు సినిమాల్లో నటిస్తూ తెగ బిజీగా ఉంది నభ.  గ్లామర్ ఆరాధకులకు నిద్రలేకుండా చేయగలిగిన నభ పుట్టినరోజు ఈరోజు. దీంతో సోషల్ మీడియాలో హంగామా జరుగుతోంది. ఈ సందర్భంగా ఆమెకు పలువురు సినీ ప్రముఖులతో పాటు ఆమె తాజాగా నటిస్తున్న చిత్రాల యూనిట్లు కూడా బర్త్ డే విషెస్ చెబుతూ ప్రత్యేక పోస్టర్లు రిలీజ్ చేశారు.

నభా నటేష్‌.. విషయానికొస్తే.. ఈమె స్వతహాగా కన్నడ భామ. ఈమె 11 డిసెంబర్ 1995లో జన్మించింది. ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం శృంగేరిలో జరిగింది. ఆ తర్వాత NMAM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉడుపిలో డిగ్రీ పూర్తి చేసింది. నభా నటేష్‌.. విషయానికొస్తే.. ఈమె స్వతహాగా కన్నడ భామ. ఈమె 11 డిసెంబర్ 1995లో జన్మించింది. ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం శృంగేరిలో జరిగింది. ఆ తర్వాత NMAM ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉడుపిలో డిగ్రీ పూర్తి చేసింది.

అంతేకాదు ఈమె బెంగళూరులో 2013లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా బెంగళూరులో టాప్ 11లో నిలిచింది. అంతేకాదు ఈ పోటీలో అభినయ తరంగగా నిలిచింది. ఇక 2015లో శివరాజ్ కుమార్ హీరోగా నటించిన ‘వజ్రకాయ’ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఇటీవల హాట్ స్టార్‌లో విడుదలైన మాస్ట్రో మంచి ఆదరణ పొందింది. ఇక నభా నటేష్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆమె ప్రస్తుతం తెలుగులో ఏ సినిమాల్లోను నటించడం లేదు.. అయితే తమిళ్‌లో రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది..

Prabhas is reportedly collaborating with Director Rishab Shetty!

Bollywood superstar cameo in Ram Charan, Janhvi Kapoor’s film?