పెళ్లి సందD, ధమాకా చిత్రాల తర్వాత అమ్మడికి డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీలీల వరసగా సినిమాలను సైన్ చేసుకుంటూ పోయింది. ఇటీవలే స్కందతో ప్రేక్షకులను పలకరించింది. అలాంటి శ్రీలీల ఉన్నట్లుండి పెళ్లి చేసేసుకుంటోంది అని రూమర్లు పుట్టించేసారు. చేతిలో బోలెడన్ని సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ పెళ్లి ఎందుకు చేసుకుంటుంది? పైగా రూమర్లు పుట్టించడానికి కారణం అంతేకంటే విడ్డూరంగా ఉంది.
శ్రీలీల ప్రస్తుతం భగవంత్ కేసరి విడుదలకు ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమా సెట్స్ లో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ పలుమార్లు దర్శనమిచ్చాడు. శ్రీలీల పక్కన నిలబడి ఫోజులు ఇచ్చాడు. అంతే ఇక పెళ్లి అనేసారు. ఒక పక్క మోక్షజ్ఞ హీరోగా రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు మరి. ఈ రూమర్లపై శ్రీలీల మండిపడింది. కొంచెమైనా బాధ్యతగా మెలగమని సలహా ఇచ్చింది..!!