నిత్యా మీనన్, అందం, అభినయం కలబోసిన మంచి నటి, అందులో సందేహం లేదు. ఆమె మణిపాల్ లో జర్నలిజం చేసారు, కాలేజీ రోజుల్లో ఆమెకు ” ప్రెట్టి గర్ల్ విత్ కర్లీ హెయిర్ ” అని మంచి ఫాలోయింగ్ ఉండేది. అప్పుడు ఆమెకు 19 ఇయర్స్ ఉంటాయి, ఆమె చేసిన ఒక పనికి కాలేజీ లో అందరు ఒక్క సారిగా నోళ్లు తెరుచుకొని ఆశ్చర్య పోయారు. మంచి చిక్కటి ఉంగరాల జుట్టు తో కాలేజీ లోని అబ్బాయిలకు గిలిగింతలు పెట్టిన నిత్యా మీనన్, ఎందుకో తెలియదు ఒక కఠినమయిన నిర్ణయానికి వచ్చి, ఒక ఆధ్యాత్మిక చింతనకు గురి అయ్యారు.
దాని పర్యవసానం, తన ఉంగరాల జుట్టును క్లీన్ షేవ్ చేసేసారు, అంటే పూర్తి గుండు కొట్టించుకొని కాలేజీ లో ప్రత్యేక్షం అయ్యారు. గుండు చేసిన వాడికి చేతులు ఎలా వచ్చాయో? చూసిన వాళ్ళందరూ దిగ్బ్రాంతి కి గురి అయ్యారు, ఎన్ని గుండెలు మౌనం గ బద్దలు అయిపొయాయో తెలియదు. కొంత మంది మాత్రం గుండుతో కూడా నువ్వు చాల అందంగా ఉన్నావు అన్నారట. జుట్టు ఉన్న అమ్మ ఏ కొప్పు వేసిన అందమే అనే సామెత విని ఉంటారు, కానీ అందమయిన అమ్మాయి గుండు గీయించుకున్న ముద్దే అంటే ఇదేనేమో. ఏమయినా నిత్యా మీనన్ ధైర్యానికి మెచ్చుకోవాలి కదూ!