in

gopichand brings beauty laxmi raai onboard for balayya’s next!

బాలకృష్ణకి మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కి తగినట్టుగానే ఆయన తన సినిమాలు ఉండేలా చూసుకుంటున్నారు. కథ ఎలాంటిదైనా అందులో తన నుంచి మాస్ ఆడియన్స్ ఆశించే మసాలా అంశాలు తగ్గకుండా చూసుకుంటారు. అంతేకాదు..సాధ్యమైనంతవరకూ తన సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉండేలా చూసుకుంటారు. అలా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసే సినిమాలోనూ ఇద్దరు నాయికలు ఉంటారట.

ప్రస్తుతం బోయపాటితో బాలకృష్ణ ‘అఖండ’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నారు. ఈ సినిమాలో ముందుగా రాయ్ లక్ష్మితో ఒక ఐటమ్ చేయిద్దామని అనుకున్నారట. ఆ తరువాత ఆమెనే మెయిన్ హీరోయిన్ గా ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో ‘అధినాయకుడు’ సినిమాలో బాలకృష్ణతో రాయ్ లక్ష్మి జోడీ కట్టింది .. ఇది రెండవసారన్న మాట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.

Anasuya’s Remuneration For ‘Thank You Brother’ Will Surprise You!

allu arjun to team up with muragadas for gajini sequel?