in

Gold or Iron, Pooja hegde is least bothered!

రవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇలా వరుసగా విజయాలను తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డేను ఈ ఏఢాదిలో ఇప్పటికే మూడు పరాజయాలను పలకరించాయి. ఎన్నో అంచనాల నడుమ మార్చి 11న వచ్చిన ప్రభాస్‌తో చేసిన రాధేశ్యామ్.. అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఓపెనింగ్స్ బాగానే ఉన్నప్పటికీ కథకు ఆడియెన్స్ కనెక్ట్ పెద్దగా కాకపోవడం వల్ల విడుదలైనప్పటి నుంచే సినిమాపై మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అనంతరం ఏప్రిల్ 13న ఇళయదళపతి విజయ్‌తో చేసిన బీస్ట్ విడుదలైంది.

ఈ సినిమా కూడా డిజాస్టర్‌గా నిలిచింది. రిలీజ్ నుంచే ఈ సినిమాపై నెగటివ్ టాక్ వచ్చింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలయికలో వచ్చిన ఆచార్య కూడా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటోంది. ఇందులో రామ్ చరణ్ సరసన ప్రత్యేక పాత్రలో కనిపించిన మన బుట్టబొమ్మ మరో డిజాస్టర్‌ను అందుకుంది..ఆచార్యలో పూజా పాత్రకు కూడా ప్రాధాన్యత లేకపోవడం వల్ల ఆ సినిమాలో ఆమె ఉందా.. అనే అనుమానం ప్రేక్షకులకు కలుగుతుంది. కనీసం సినిమా అయినా అనుకున్న స్థాయిలో ఆడుతుంటే.. సినిమా హిట్‌ అయిదనే సంతృప్తి మిగిలేది..

I said sorry to Mahesh sir thrice: Keerthy Suresh

kapilakshi malhotra sets the internet on fire!